Wednesday, 3 April 2013

కళ్ల చుట్టూ ఉండే నలుపు తగ్గాలంటే?


చాలా మంది కళ్ల చట్టూ నలుపు వలయాలు ఏర్పడి అందవిహీనంగా ఉంటోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో మార్కెట్‌లో లభించే అనేక రకాల క్రీములను, లోషన్‌లను, సబ్బులను డాక్టర్‌ సలహా లేకుండా వాడు తున్నారు. ఫలితంగా సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువై మానసికంగా ఆందోళన చెందుతున్నారు.
కళ్ల చుట్టూ ఉండే నలుపుకు చాలా కారణాలున్నాయి. సరిపడా నిద్ర లేకపోవడం, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం, హార్మోన్ల అసమతౌల్యం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, స్త్రీలలో బహిష్టులు సరిగ్గా లేకపోవడం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి.
నివారణ చర్యలు
వేళకు నిద్రపోవాలి. కనీసం రోజూ 7 నుండి 8 గంటలు నిద్ర పోవాలి.
రోజూ దాదాపు ఎనిమిది గ్లాసుల మంచినీళ్ళు తాగాలి.
కంప్యూటర్‌ ముందు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో కళ్లను మూసుకుని రెండు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంంత అలసట తగ్గుతుంది.
డాక్టర్‌ సలహా లేకుండా రకరకాల క్రీములు, లోషన్‌లు వాడకూడదు.
సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవడం చాలా మంచిది.
ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, స్వీట్లు, నిల్వ ఉన్న ఆహారపదార్థాలు తినకూడదు.
ప్రకృతిసిద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలను, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
రోజూ విధిగా కొంత సమయం యోగా, వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మందులు
కళ్ల చుట్టూ నల్లని వలయాలు పోవడానికి హోమియో వైద్యంలో మందులు ఉన్నాయి. అందులో ముఖ్యమైన మందులు ఇవి. అయితే వీటిని డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే వాడాలి.
ఆర్సెనికమ్‌ ఆల్బమ్‌: ఈ మందు కళ్ల చుట్టూ నల్లటి వలయాలు పోవడానికి తప్పక ఆలోచించదగినది. కళ్ల చుట్టూ వచ్చే ఈ నల్లటి వలయాలు దురదగా ఉంటాయి.
వీరికి మధ్యాహ్నం, అర్ధరాత్రి బాధలు ఎక్కువగా ఉండటం గమనించదగిన ప్రత్యేక లక్షణం. కళ్ల చుట్టూ నలుపు వలయాలతో పాటు వీరికి కళ్ల నుండి నీళ్లు కారుతాయి. ఒంటిపై దద్దుర్లు, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
0నేట్రమ్‌మోర్‌: హార్మోనుల లోపం వల్ల కళ్ల చుట్టూ నలుపు వయాలు ఏర్పడిన వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరు మానసిక స్థాయిలో కుంగిపోయి ఉంటారు. దు:ఖం పొర్లుకు వస్తుంది. నలుగురిలో కాకుండా వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఓదార్పు మాటలు సహించలేరు. ఈ లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఎఖినీషియా: కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి, ఇన్‌ఫెక్షన్‌కు గురై బాధిస్తున్నప్పుడు ఈ మందు ద్రావణాన్ని దూదితో తీసుకుని పైపూతగా రాయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. ఈ మందు యాంటిసెప్టిక్‌గా పనిచేసి ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా తగ్గిస్తుంది.
సైలీషియా, కాల్కేరియా ఫ్లోర్‌: కళ్ల చుట్లూ నలుపు వలయాల వల్ల ఏర్పడిన మచ్చలను ఈ మందులు తొలగిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ను కూడా నివారిస్తాయి.
ఈ మందులే కాక లక్షణాల సముదా యాన్ని అనుసరించి రూస్‌టాక్స్‌, తూజా, బెల్లడోనా, లైకోపోడియం తదితర మందులను కూడా వాడితే ప్రయోజనం ఉంటుంది. ,

No comments:

Post a Comment