కలత నిద్రలో.........
జీవితంలో చాలా భాగం నిద్రలోనే గడిచిపోతుంది అనే మాట నిజమే అయినా, మనిషిలో
అలసటని మాయం చేసి తిరిగి జీవనోత్సాహాన్ని నింపేది కాబట్టి ఆ మాటని పూర్తి
నెగెటివ్‌గా భావించలేం. నిద్ర గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అసలే
అనలేం. తెలుసుకోండి మరి.
మన దేశంలోని 30శాతం మంది నిద్రలేక, కలతనిద్రతో ఇబ్బందులు పడుతున్నారు.
సరైన నిద్రకోసం నిద్రమాత్రలు వేసుకునే పెద్దవయసు వారిలో మూడవవంతు మంది
మహిళలే.
ఇలా నిద్రమాత్రలు వాడే అలవాటు చిన్నవారిలో 60శాతం మందిలో ఇతరుల మీద
ఆధారపడే మనస్తత్వం అభివృద్ధి చెందుతుందని న్యూఢిల్లీలోని ఒక డాక్టర్
అంటున్నారు.
నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు
ఇన్సోమ్నిమా: నిద్రపట్టకపోవడం, దీర్ఘనిద్ర లేకపోవడం,
నిద్ర కలతలు ఎక్కువగా ఉండడం, పక్కమీద దొర్లుతూ ఉండడం, ఎక్కువసేపు పడుకున్నా
సరే, ఆరోగ్యకరమైన నిద్రలేకపోవడం, దీనివల్ల రోజంతా నిద్ర మత్తుగా ఉండడం
మొదలైన సమస్యలు ఉంటాయి.
స్లీప్ ఆప్నియా: హఠాత్తుగా నిద్రలో ఊపిరాడనట్టనిపించి
లేచి శ్వాసకోసం తీవ్రంగా ప్రయత్నించడం, గురకపెట్టడం, రోజంతా కొద్దిసేపు
పడుకుంటే బాగుండుననిపించడం ఇవన్నీ స్త్రీలలో ఎక్కువగా మెనోపాజ్ సమయంలో
కనిపించే లక్షణాలు.
నిద్రలేమి: నిద్రలో జోగుతున్నట్లు ఉండడం,
అలిసిపోయినట్టుగా ఉండడం, రోజంతా విసుగ్గా, మూడీగా ఉండడం ఇవన్నీ ఒత్తిడితో
కూడిన జీవనవిధానం వల్ల కలిగే సమస్యలే. ఇవన్నీ నిద్రను తగ్గిస్తాయి. ఇదంతా
వ్యాధినిరోధక వ్యవస్థ మీద తీవ్రప్రభావం ఉంటుంది.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్: కాళ్లలో దురద, నొప్పి, కండరాలు
మెలిపడినట్లు, నరాలు లాగినట్లుగా ఉండడం, దీనివల్ల విశ్రాంతిగా పడుకున్నపుడు
కూడా కాళ్లు కదపాలనిపిస్తూనే ఉంటుంది. ఈ కారణంగా నిద్ర నుంచి తరుచుగా
మెలకువ వస్తుంటుంది. ఈ పరిస్థితులకు ఎక్కువగా ఐరన్‌లోపమే కారణమై ఉంటుంది.
No comments:
Post a Comment