Wednesday, 19 June 2013

వ్యాయామమే మెదడుకు ఆహారం

శరీరానికి, మెదడుకు వ్యాయామం మంచిదని ప్రాచీనకాలంలో రుషులు, ఆ తర్వాత తత్వవేత్తలు చెబుతూ వచ్చారు. యోగశాస్త్రాలు, చైనా ఆరోగ్య గ్రంథాలు చాలా ఏళ్ల నుంచి కూడా వ్యాయామం వల్ల కేవలం శరీరానికే కాక మనస్సుకు సుగుణాలు కలుగుతాయిని చెప్పాయి. 'మనిషి మెదడును ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసేది ఒక్కటే. అదే వ్యాయామం' అని గ్రీకుకు చెందిన సిసిరో క్రీస్తూ పూర్వం 65లో రాశారు. మానసిక చురుకుదనానికి భౌతిక వ్యాయామం ఎలా అనుసంధానం చేస్తుందో గమనించండి. ఈ రెండింటికి సంబంధం ఉందనేది నిజమా? ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది?. ఈ అంశంపై న్యూరోసైన్స్‌ అండ్‌ బిహేవియరల్‌ పత్రికలో ఒక అద్భుతమైన సమీక్ష 'బెనిఫిసియల్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ ఆన్‌ న్యూరోప్లాస్టిసిటి అండ్‌ కాగ్నిషన్‌' పేరుతో ప్రచురితమైంది. జర్మనీలోని హంబర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టిన్‌ హటింగ్‌, బ్రిగ్టి రొడర్‌ ఈ సమీక్ష రాశారు. న్యూరోప్లాస్టిసిటీ అంటే పరిస్థితులను బట్టి మెదడులోని నాడీ వ్యవస్థ తన వ్యవస్థను సవరించుకునే సామర్థ్యం కలిగి ఉండటం. ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే .. శారీరక శ్రమకు చెందిన ఒక ఉపవర్గం. శరీర భౌతిక దృఢత్వం మెరుగుపరచడానికి ఫిజికల్‌ యాక్టివిటిని ప్రణాళికబద్దమై. నిర్మాణాత్మక, పునరావృత, లక్ష్యంతో చేయాలి.
ఎన్నో పరిశోధనలు
వ్యాయామం వల్ల కలిగే ప్రభావాలే కాక మెదడు పనిచేసే తీరు గురించి గత 15 ఏళ్లుగా ఈ అంశంపై పరిశోధన పత్రాల వరదలా వచ్చాయి. వ్యాయామం, జ్ఞానశక్తి, వయసుతోపాటు పెరిగే మెదడుపై ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్రామర్‌, తన సహచరులతో గొప్ప సమీక్ష ప్రచురించారు. ప్రచురించిన వివిధ అధ్యయన, పరిశోధన ఫలితాల ఆధారంగా ఒక ముగింపునుకు వచ్చారు. క్రమం తప్ప కుండా వ్యాయామం చేయడం వల్ల తర్వాతి కాలంలో డిమెన్షియా, అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాక జ్ఞానశక్తిపై 'న్యూరోప్రొటెక్టివ్‌' ప్రభావం చూపిస్తుంది. ఆరు నెలల పాటు, వారానికి మూడుసార్లు 45 నిమిషాలు వ్యాయామం చేసిన ఆరోగ్య కార్యకర్తలపై జరిగిన అధ్యనం వల్ల ఈ ఫలితాలు వెల్లడి అయ్యాయి. వ్యాయామ చేస్తున్నప్పుడు దానిపైనే దృష్టిపెట్టండి, దృష్టిని మరల్చే అంశాలను పట్టించుకోకండి అని వారికి సూచించారు. ఈ క్రమంలో వారిని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు. వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులోని ఏ భాగం ఈ పనిలో ఉందో తెలుసుకోవడానికి ఈ స్కానింగ్‌ నిర్వహించారు. మెదడులోని ముందు భాగం కార్యాచారణ పెరుగుతుందని స్కానింగ్‌ చిత్రాలు విశ్లేషించాయి.
మూడు అంశాలు..
ఈ సందర్భంగా కొన్ని అంశాలు ముఖ్యమని వెల్లడైంది. మొదటిది...వ్యాయామాలు అనేక రకాలు. స్ట్రెచ్చింగ్‌ వ్యాయామం కంటే ఎరోబిక్స్‌ వ్యాయామం (ఎక్కువ ఆక్సీజన్‌ తీసుకోవడం లేదా మరింత విస్తృతంగా శ్వాసతీసుకునే వ్యాయామం) సమర్థవంతమైంది. రెండోది...శారీరక వ్యాయామాం వల్ల కలిగే ప్రయోజనాల ప్రభావం మెదడు పనితీరుకు చాలా ఉపయోగమని తెలిసింది. అంటే మెదడు ముందు భాగం పాలుపంచుకునే చర్యలు... జ్ఞాపకశక్తి, దృశ్యాలు తీక్షణగా చూడటం వంటివి. వ్యాయామం వల్ల మెదడులోని ఇంకా ఏ భాగం ప్రేరేపణకు గురవుతుందో తెలుసుకోవాల్సిన అవసరముంది. మూడోది.. శారీరక వ్యాయామాలు వివిధ రకాలు. ఎరోబిక్‌, అనెరోబిక్‌, యాక్టివ్‌, సెడెంటరీ. వివిధ రకాల శారీరక శిక్షణ మెదడులోని 'న్యూరో-కాగ్నిటివ్‌ నెట్‌వర్క్స్‌'పై ప్రభావం చూపుతాయి అని హాటింగ్‌, రోడర్‌ పరిశీలించారు.
సైన్స్‌ ఏం చెబుతోంది?
వ్యాయామం గురించి ఆధునిక జీవశాస్త్రం ఏం చెబుతోంది? జంతువులను విశ్లేషించిన తర్వాత (ముఖ్యంగా ఎలుకలు) శారీరక వ్యాయామం మెదడులోని బూడిద రంగును ( ఈ భాగంలోనే నాడీకణాలు, అనుసంధానాలు ఎక్కువగా ఉంటాయి) పెంచిందని వెల్లడైంది. ప్రయోగాలు ఏం చెబుతున్నాయంటే...
1. క్రీయాశీలత, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిపై ప్రవర్తన వంటి అంశాల పనితీరును ఎరోబిక్‌ వ్యాయామాలు మెగురుపరుస్తున్నాయి.
2. ఈ ప్రభావం నెలలు, సంవత్సరాలు ఉంటోంది.
3.న్యూరాన్ల మధ్య కొత్త నాడీకణాలు, రక్తనాళాలు, అనుసంధానాలు ఏర్పడటంలో వ్యాయామం ప్రోత్సహిస్తోంది.
4. ఇవే కాక రెండు ముఖ్యమైన బ్రెయిన్‌ డెరైవ్డ్‌ న్యూరోట్రోపిక్‌ ఫ్యాక్టర్‌ (బిడిఎన్‌ఎఫ్‌), ఇన్సులిన్‌ లైక్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 1 (ఐజిఎఫ్‌ఐ) ఏర్పడటంలో వ్యాయామం ప్రోత్స హిస్తుంది. ఇవి రెండూ న్యూరాన్లు, న్యూరో ట్రాన్స్‌మీటర్లు ఉత్పత్తి అవడానికి ఇవి రెండు ప్రోత్సహిస్తాయి.
5. వ్యాయామం దీర్ఘకాల వ్యాధులు... టైప్‌-2 మధుమేహం, పక్షవాతం, అధిక రక్తపోటు వంటి వాటిని తగ్గిస్తుంది.

No comments:

Post a Comment