Thursday, 20 June 2013

అరికాళ్ళ మంటలు.....

 అరికాళ్ళ మంటలు.....
 
- అరస్పూన్‌ సాంబ్రాణి, కొద్దిగా గవ్వ పలుకు తీసుకుని దాన్ని యాభైగ్రా. నువ్వుల నూనెలో వేసిబాగా కాచి, చల్లార్చి ప్రతిరోజూ మూడుపూటలా అరికాలిమీద రాస్తుంటే అరికాలి మంటలు తగ్గుతాయి.
- మర్రిచెట్టు బెరడు మీద చాకుతో గాటుపెడితే పాలు కారతాయి. వీటిని ఒక చిన్న గ్లాసులో పట్టి ప్రతిరోజూ మూడుపూటలా అరికాళ్లకు రాస్తుంటే అరికాలి మంటలు తగ్గిపోతాయి.
- గోరువెచ్చని నీటిలో అరికాళ్లను ఉంచితే పావుగంటలో అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.
- అల్లాన్ని మెత్తగా నూరి గుజ్జుగా చేసుకుని దాన్ని అరికాళ్లకు ప్రతిరోజూ మర్దనా చేసుకుంటుంటే అరికాళ్ల చర్మపు పొరలు ఊడటం తగ్గిపోయి. అరికాళ్ల మంటలు కూడా తగ్గుతాయి.

No comments:

Post a Comment